Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భగత్ సింగ్ 115వ జయంతి
- సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ-దోమ, పరిగి
దేశభక్తికి, త్యాగానికి, ధైర్యానికి, సమున్నత మానవ విలువలకు నిలువెత్తు నిదర్శనం భగత్‌సింగ్ 115వ జయంతిని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పరిగి పట్టణంలో నిర్వ హించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య మాట్లాడుతూ నేడు దేశవ్యా ప్తంగా కొంతమంది నకిలీ దేశభక్తులు, కుహనా జాతీయవాదులు, ద్వేషమే దేశ భక్తిగా ప్రచారం చేస్తున్న ప్రస్తుత తరు ణంలో అసలు సిసలైన 100 శాతం నిఖార్సైన దేశభక్తికి ప్రతీకైన భగత్‌సింగ్ ను స్మరించుకోవాలన్నారు. పరాయి పాలన నుండి విముక్తి కోసం సామ్రాజ్య వాదాన్ని తరిమి కొట్టడంతో పాటు దేశం లోని భూస్వాముల, పెట్టుబడిదారుల దోపిడీ, అణచివేతల నుండి విముక్తి కలిగించాలన్నారు. మతం, కులం పేరుతో సాటి మనుషులపై జరిగే దౌర్జ న్యాలను ఎదిరించాలని, స్త్రీ, పురుష సమానత్వ వ్యవస్థ కావాలని ఆయన ఆకాంక్షించారని అన్నారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం నేటి భారత యువత కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు బసిరెడ్డి, శేఖర్, తీర్మాలయ్య, వెం కటేష్, శీను లక్ష్మి, సునీత, అనంతమ్మ, అమృతమ్మ దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.