Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్
- బోయిన్ గుట్ట తాండలో బతుకమ్మ చీరలు పంపిణీ
నవతెలంగాణ-ఆమనగల్
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయానికి ప్రతీక బతు కమ్మ పండుగని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీని వాస్, జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధిశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జెడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. కడ్తాల్ మండలంలోని చరి కొండ గ్రామ పంచాయతీ పరిధిలోని బోయిన్ గుట్ట తాండాలో మంగళవారం బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతి థులుగా గోలి శ్రీనివాస్ రెడ్డి, దశరథ్ నాయక్ తది తరులు హాజరై మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డల ఆత్మగౌర వాన్ని పెంపొందించే విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నారని అ న్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, సర్పం చ్ భారతమ్మ నర్సింహ గౌడ్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు జోగు వీరయ్య, బాలకృష్ణ, జంగయ్య, ఉపసర్పంచ్లు నరేష్, వినోద్, వెంకటేష్, నాయకులు చిన్నం జంగయ్య, జంగయ్య, శాంతి, లింగం యాదవ్, అంజి, వెం కటయ్య, బావోజీ, సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.