Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ లలితా జ్యోతయ్య
- ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన ఇండ్ల నిర్మాణాలు
నవతెలంగాణ-ఆమనగల్
తలకొండపల్లి మండల జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ తాను స్థాపించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుం బాలకు నీడ కల్పిస్తూ సేవకు మారుపేరుగా నిలుస్తున్నారని తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతయ్య అన్నారు. మంగళ వారం తలకొండపల్లి, వెంకట్రావ్ పేట్, జంగారెడ్డి పల్లి తదితర గ్రామాలకు చెందిన పి.మైసయ్య, మారేమోని లక్ష్మమ్మ, సొప్పరి శ్రీను, అండాలమ్మ, డి.తిరుపతిరెడ్డి తదిత రుల ఇంటి నిర్మాణాలకు కావలసిన సిమెంట్ స్టీల్ ఇసుక తదితర వాటిని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లు లలిత జ్యోతయ్య, పయ్యావుల రమేష్ యాదవ్ తదితరులు మాట్లాడారు. జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా చేప డుతున్న సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలోని నిరు పేద కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు సునీత సుదర్శన్ రెడ్డి, మల్కేడి అంబాజీ, సర్పంచ్ బండి రఘుపతి, ఉపసర్పంచ్ ఎంఏ అజీజ్, పీఏసీఎస్ డైరెక్టర్ శేఖర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ యాదయ్య పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి ఆర్థికసాయం
కల్వకుర్తి నియోజకవర్గంలోని తోటపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతు సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల కొండపల్లి మండల జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి తన ట్రస్ట్ ద్వారా మృతుని కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 3 వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీనివాస్ గౌడ్, నరేష్ గౌడ్, అనిల్ కుమార్, బాలస్వామి, కృష్ణయ్య, భగవంతు, రామచంద్రయ్య పాల్గొన్నారు.