Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేక వనంపల్లి సొసైటీ చైర్మన్ డీసీసీబీ డైరెక్టర్ పట్లోళ్ల అంజి రెడ్డి
నవతెలంగాణ-మోమిన్‌పేట
ఆదర్శ సొసైటీగా సహకార సంఘంను తీర్చిదిద్దుతా మని మేక వనంపల్లి సహకార సంఘం అధ్యక్షుడు, డీసీసీ బీ డైరెక్టర్ పట్లోళ్ల అంజి రెడ్డి అన్నారు. మంగళవారం సొసైటీ చైర్మన్ అంజి రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యులు, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి సహకారంతో సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి చేసుకున్నా మని, ఇప్పటికే రూ.30లక్షల సొంత భవనాన్ని నిర్మించు కున్నామని, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణా లను 90 శాతం రికవరీ చేస్తామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సభ్యులు ఇతర బ్యాంకుల చుట్టూ తిరగకుండా సహ కార సంఘం ద్వారా బంగారు ఆభరణాల పై రుణాలు లాకర్ సదుపాయాలను ఏర్పా టు చేశామన్నారు. సంఘంలో 1082 మంది రుణాలు తీసుకోగా అందులో 328 మందికి రుణమాఫీ కాగా, 750 మందికి రుణమాఫీ కావాల్సి ఉందని, మూడో విడతలో వారికి రుణమాఫీ అవుతుందన్నారు. రబీ, ఖరీఫ్ సీజన్లో రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఫర్టిలైజర్ అందుబాటులో ఉంచి విక్రయిస్తామని సంఘ సభ్యులు తీసుకున్న రుణా లను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి కృషి చేయా లన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు శేఖర్, సోమిరెడ్డి పోచమ్మ, సువర్ణ బాగయ్య గోపాల్ రెడ్డి, నాయ కులు రామకృష్ణ రెడ్డి, మల్లేశం, విజయ, నరసింహారెడ్డి, బు చ్చి రాములు, సహకార సంఘం సిబ్బంది సీఈవో బాల కృష్ణ, జాంగిర్, యాదయ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.