Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు
నవతెలంగాణ - కుల్కచర్ల
ప్రస్తుత సీజన్లో వేరుశనగ, పంట వేసుకునేందుకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ పై రైతులు గంపెడాశలు పెట్టు కున్నారని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు అన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని కోటి ఆశతో భూమిని చదును చేసి సిద్ధంగా చేసుకున్న కానీ.. రైతులకు మాత్రం నిరాశ ఎదురవుతుందని అన్నారు. రైతులకు సరైన సమ యానికి వేరుశనగవిత్తనాలు అందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమే అని అన్నారు. రెండు రోజుల్లో రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తా మని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తులసి రామ్నా యక్, గుండాబాల కృష్ణయ్య, సోమలింగం శ్యామ్, రైతులు పాల్గొన్నారు.