Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
నిరుపేదల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళ వారం తాండూరు పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని అన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి పెండ్లి అయ్యే వరకూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా ఉంటున్నారని అన్నారు. 24 విభిన్న డిజైన్లు ,10 రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) తో చేనేత కార్మికులు నేచిన చీరలు, 92.00 లక్షల రెగ్యులర్ చీరలకు అదనంగా, వయోవృద్ధ మహిళలు ధరించే విధంగా 9.00 మీటర్లు పొడవు ఉన్న చీరలు 8 లక్షల చీరలు. రూ. 339.73 కోట్ల ఖర్చుతో కోటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందన్నారు.పండగపుట ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని బతుకమ్మ , రంజాన్, క్రిస్మస్ పండుగలకు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ముస్లిం సోదరీమణులకు రంజాన్ కిట్లు (తోఫా), క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ కిట్లు అంద జేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్ని తెలిపారు. పల్లె ప్రగతి పేరుతో ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి,సీసీ రోడ్లు, డంపింగ్ యార్డులు,పల్లె ప్రకృతి వనాలు గ్రామీణ క్రీడా ప్రాంగణాలు లాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పట్టణాలకు దీటుగా పల్లెల్ని తీర్చిదిద్దిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్,మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు నర్సిరెడ్డి, పట్లోల్ల నర్సింలు, మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, మధు బాల, శోభారాణి, రత్నమాల, సోమశేఖర్, రాము, వెంకన్న గౌడ్, ప్రవీణ్ గౌడ్, సంగీత ఠాగూర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.