Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
- బతుకమ్మ చీరెలు పంపిణీ
నవతెలంగాణ-చేవెళ్ల
టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్టు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల మండలంలోని చేవెళ్ల గ్రామానికి చెందిన లబ్దిదారులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్టు గుర్తుచేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని వాటిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు అధి కారులు దష్టి సారించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పడు తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుభీమా పథకాలు, ఆసరా పింఛన్లు అందజేసి భరోసానిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మీ రమణారెడ్డి, చేవెళ్ల జడ్పీటీసీ సభ్యురాలు మాలతి కృష్ణారెడ్డి, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవరి వెంకటరెడ్డి, చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజా రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.