Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేం దర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో లబ్దిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీరలను ఇవ్వలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తు న్నారన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిసున్నాయన్నారు. ఈ కార్యక్ర మంలో వైస్‌ఎంపీపీ జడల లక్ష్మీరాజేందర్ గౌడ్, ఎంపీడీవో అనురాధ, డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికుమార్, సర్పంచ్ సబ్రమణ్యేశ్వరీ, నాయకులు నక్క శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. అదే విధంగా షాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఆశాలకు యూనిఫాములు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచోదామోదర్, సిహెచ్ గోపాల్ రడ్డి, నాయకులు, సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.