Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ ఎం. మల్లేశం
- పూడూర్ సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-పూడూరు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని ఎంపీపీ మల్లేశం అన్నారు. బుధవారం పూడూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు. మొదట తాగునీటి సరఫరా పై చర్చ జరగగా గ్రామాల్లో ఎక్కడ కూడా మిషన్ భగీరథ నీరు పూర్తి స్థాయిలో రావాడం లేదని ఏ గ్రామంలో చూసిన లీకేజీలు ఉన్నాయని సభలో సర్పంచులు ఎంపీటీసీలు సభ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నర్సింలు స్పందిస్తూ మండలంలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు అందిస్తున్నామని కానీ కొన్ని గ్రామాల్లో కొన్ని కేజీలు పైప్ లైన్ సరిగాలేక వాటర్ ట్యాంకి లోకి నీరు పోవడం లేదన్నారు. త్వరలో ఆ సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గత మూడు నెలలుగా పూడూరు గ్రామానికి అనుబంధ గ్రామం మైసమ్మగడ్డ తండా కు మిషన్ భగీరథ తాగునీరు పోవడం లేదని ఎంపీటీసీ సల్మా తాజోదిన్ సభ దృష్టికి తీసుకువచ్చారు. గత వారం రోజు లుగా లీకేజీ పనులు చేస్తున్నారని పైప్ లైన్ లో చెత్త ఇరుక్కుపోవడం వల్ల వాటర్ రావడం లేదు త్వరలో సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుం టామని తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ పై చర్చ రాగ విద్యుత్ అధికారులు విద్యుత్ సమస్యలపై ఎప్పుడు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని విద్యుత్ అధికారులు ఎక్కడ పని చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. గత సర్వ సభ్య సమావేశంలో కూడా చెప్పిన సమస్యలు ఇప్పటికీ పరిష్కరిం చలేదని నిజాంపేట్ మేడిపల్లి సర్పంచ్ పెంటమ్మ, పెద్ద ఉమెం తల్ సర్పంచ్ శ్రీధర్ గుప్తా సభలో విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీపీ మల్లేశం స్పందిస్తూ గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉన్నప్పుడు సర్పంచులు చేసే ఫోనుకు స్పందించాలని విద్యుత్ అధికారులకు తెలిపారు. అనంతరం వివిధ శాఖల పై సాదాసీదాగా చర్చలు జరిగాయి. అనంతరం ఈ సందర్భంగా ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా అధికారులు చొరవ తీసు కోవాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని అధికారులకు ఆదేశించారు. నూతనంగా అందిస్తున్న పింఛన్ కార్డులు లబ్దిదారులు అందరికీ అందించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మల్లిపెద్ది మేఘమాల ప్రభాకర్ గుప్తా, ఎంపీడీవో, సొసైటీ చైర్మన్. పి సతీష్ రెడ్డ, మండల కో ఆప్షన్ మెంబర్ అయూబ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు అనంత్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.