Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయటపడుతున్న అక్రమాలు ట్రైడెంట్, ఆర్కాన్,
- సన్ రైస్ ఆస్పత్రిల్లో ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ నిల్
- అధికారులు వస్తున్నారని క్లినిక్‌లను మూసి ఉంచుతున్న వైనం
- షోకాజ్ నోటీసుల జారీకి ఉన్నతాధికారులకు సిఫారసు
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్‌లో ప్రయివేట్ ఆస్పత్రులలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ నెల 22 నుంచి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఆస్పత్రులుగా గుర్తింపు పొందిన ఆస్పత్రిల్లో కనీస సౌకర్యాలు గానీ, రక్షణ సౌకర్యాలు లేవన్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది. తనిఖీలు చేస్తుంటే కొంతమంది ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న ఆస్పత్రులను అధి కారులు వస్తున్నారన్న సమాచారం మేరకు మూసేసి తప్పించుకు తిరుగుతున్నారు. వీటిపైన చర్యలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు పైగా ప్రాణాలు కోల్పోయి మరి కొంతమంది అస్వస్థతకు గురైన విషయం విదితమే. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంపై సీరి యస్‌గా దృష్టి పెట్టింది. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం కోసం వచ్చే పేషెంట్ల కోసం ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనే విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా శంషాబాద్ మండలంలో కూడా ఈనెల 22వ తేదీ నుంచి రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు ప్రయివేటు ఆస్పత్రులపై తనిఖీలు జరుగుతున్నాయి. శంషాబాద్ మండలంలో నర్కూడ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ దివ్య, పెద్ద షాపూర్ వైద్యాధికారి ప్రభాకర్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ నర్కూడ పి హెచ్‌సీ పరిధిలో 27 వ తేదీ వరకు 41 ఆస్పత్రుల్లో తనిఖీలు జరిగాయి.
శంషాబాద్‌లో ప్రయివేటు పెద్ద ఆస్పత్రులైన ట్రైడెంట్ హాస్పిటల్, ఆర్కన్ హాస్పిటల్, సన్ రైస్ హాస్పిటల్లలో అధికారులు అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్ఓసీ లేనట్లు గుర్తించారు. వచ్చే పేషెంట్ల కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది. దీంతో పాటు ఇతర అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుని తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.
వీటితోపాటు శంషాబాద్‌లోని స్వామి హాస్ప టల్లో బయోమెడికల్ సర్వీసులు సంబంధించిన సర్టిఫికెట్ లేదు. నఫీస్ క్లినిక్, అద్నాన్ క్లినిక్ బీఏఎం ఎస్బీయూఎంఎస్ సర్టిఫికెట్లతో ఆస్పత్రులను నడుపుతున్నారు. హౌమియో వైద్యం సంబంధించిన సర్టిఫికెట్లతో సాధారణ వైద్యం చేస్తున్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది. లక్ష్మి ఈఎన్టీ క్లినిక్, ఆరోగ్య గ్యాస్ట్రో అండ్ గైనకాలజీ హాస్పిటల్లో యాజమాన్యం రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్న ప్పటికీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. మధు రానగర్‌లో నిర్వహిస్తున్న మధు క్లినిక్‌కు రిజిస్ట్రేషన్ లేకుండానే చట్ట విరుద్ధంగా ఆస్పత్రి కొనసాగి స్తున్నారు. వీటితోపాటు యాక్సెస్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్, ఎమ్మెస్సార్ క్లినిక్, శాంతి నివాస్ క్లినిక్, మారుతి క్లినిక్ సాయి మైండ్ క్లినిక్ , ఎమ్మెస్సార్ క్లినిక్ లో అధికారులు తనిఖీలకు వస్తారని ముందస్తు సమాచారం మేరకు మూసి ఉంచారు. శాంతి క్లినిక్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. స్కిన్ క్లినిక్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సాయి కిరణ్ ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ తనిఖీలకు వస్తున్నారని మూసేశారు. సాయి మల్లికార్జున హాస్పిటల్‌కు రిజిస్ట్రేషన్ లేదు. సాయి కృషా క్లినిక్, బిస్మిల్లా క్లినిక్, బుద్వేల్ క్లినిక్ , ఎంఎస్ క్లినిక్‌లు తనిఖీల సమయంలో మూసేశారు. ఇప్పటివరకు నర్కూడ పి హెచ్ సి పరిధిలో 41 ప్రయివేట్ ఆస్పత్రులను తనిఖీలు చేశారు. ఇందులో ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా 17 ఆస్ప త్రులు కొనసాగుతున్నట్టు అధికారులు గుర్తించారు. సుమారు పది ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు, రక్షణ చర్యలు సర్టిఫికెట్లు లేనట్లుగా గుర్తించారు. 14 ఆస్పత్రులలో తనిఖీలకు వస్తున్నారని ముందస్తు సమాచారంతో మూసి ఉంచారు. మండలంలో నకిలీ డాక్టర్లు నకిలీ వైద్యం చేస్తూ కోట్లకు పడగ లెత్తుతున్నారు. గ్రామీణ మండలంలో ఇప్పటికీ 90 శాతం పైగా నకిలీ హాస్పిటల్ ఉన్నాయి. వైద్యా ధికారులు వాటిపైన ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇప్పటికి నర్కూడ పిహెచ్సి పరిధిలో గ్రామీ ణ ప్రాంతంలో తనిఖీలు చేయాల్సి ఉండగా అక్కడ తనిఖీ చేస్తారా లేక వదిలేస్తారా చూడాల్సిందే.