Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మీర్పేట్
రాష్ట్ర అస్తిత్వానికి, సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా రు. బుధవారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెల గూడ చల్లా లింగారెడ్డి పాఠశాలలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలను విద్యాశాఖ మంత్రి సబి తా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల 50 వేల చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చీరల్లో కేసీఆర్ అభిమానం, నేతన్న ల కష్టం చూడాలని, మహిళలకు ప్రభుత్వం చిరు కానుక అందిస్తుం డటంతో నేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తు న్నాయన్నారు. మహిళలు ఆత్మగౌ రవంతో బతకాలని మిషన్ భగీరథ తో నీటి కష్టాలు దూరమయ్యాయ ని, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాది ముబారాక్లతో అం డగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, మేనేజర్ వెంకట్ రెడ్డి, స్థానిక కార్పోరేటర్ గజ్జెల రామచందర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.