Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శెట్టిపల్లి సర్పంచ్ ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం
నవతెలంగాణ-ఆమనగల్
కొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలం లోని ఆయా గ్రామాల్లో ఉన్న వాగులు, పంట కాల్వలు పొర్లి పారుతున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని శెట్టి పల్లి గ్రామం సమీపంలోని వాగు ఉదృతంగా ప్రవహిస్తుం ది. దీంతో ఆ దారి గుండా తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు, శెట్టిపల్లి సర్పంచ్ ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం తమ సొంత డబ్బులు వెచ్చించి సుమారు రూ.25 వేలు ఖర్చు చేసి కుమ్మరి చిరంజీవి వ్యవసాయ బావి సమీపంలో సిమెంట్ పైపులతో వాగుపై వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. వాగుపై పైపులతో కల్వర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్న సర్పంచ్‌కు ఆ ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో ఉపసర్పంచ్ వెంకటయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటయ్య, ఎస్.వెంకటయ్య, కుమ్మరి శ్రీను, కుమ్మరి శంకరయ్య, బోగరాజు లక్ష్మయ్య, కట్ట రాములు, భారయ్య తదితరులు పాల్గొన్నారు.