Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లేడ్ సర్పంచ్ మీదిగడ్డ బాబూరావు
నవతెలంగాణ-షాద్నగర్
పచ్చదనం పరిశుభ్రతతో గ్రామం అభివృద్ధి చెందు తుందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉండాలని సర్పంచ్ మీదిగడ్డ బాబూరావు అన్నారు. షాద్నగర్ నియోజ కవర్గ పరిధిలోని చౌదరిగుడా మండల పరిధిలోని జిల్లేడ్ గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఉన్న పిచ్చి మొక్క లను లేబర్ హాయంతో తొలగించారు. ఈ సందర్భం గా సర్పంచ్ బాబురావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. గ్రామంలో ఎక్కడా నీరు నిలువకుం డా చూడాలన్నారు. నీరు నిలువఉంటే ప్రజలు రోగాల భారీగా పడతారన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవా లన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సమత, వార్డు సభ్యులు ఎల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.