Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- కందుకూరులో బతుకమ్మ చీరల పంపిణీ
- పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మహిళలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డితో కలిసి చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడబిడ్డ సంతోషంగా ఉంటే కుటుంబమంతా సంతోషంగా ఉంటారని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ అని, వైభవంగా జరుపుకునే పండుగ దసరా పండుగ అన్నారు. 2017 సంవత్సరంలో ప్రారంభించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఏటా నిర్వహిస్తున్నామన్నారు. సిరిసిల్లలో 16,000 మంది నేతనులు గౌరవప్రదమైన ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం వేతనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ ప్రాజె క్టుకు రూ.339 కోట్ల బడ్జెట్లో కేటాయించామన్నారు. రంగారెడ్డి జిల్లాకు 4 లక్షల 50 వేలు, కందుకూరు మండ లానికి 16,000 బతుకమ్మ చీరలు పంపిణీ చేశా మన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి పాండు, జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కప్పాటి పాండు రంగారెడ్డి, సర్పంచ్ సమంతకమని, ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి, తాసిల్దార్ మహేందర్ రెడ్డి, ఎంపీడీవో వెంకట్ రాములు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.