Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయ పరిశోధన కేంద్రం రాజేంద్రనగర్ వరిశాస్త్రవేత్తలు డా. స్వామి, డా. శ్రీధర్
నవతెలంగాణ-షాబాద్
వరి సాగులో సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని భారతీయ పరిశోధనా కేంద్రం రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలు డాక్టర్ స్వామి, డాక్టర్ శ్రీధర్లు అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధి లోని ముద్దెం గూడలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అద్వర్యం లో ఏర్పాటు చేసిన సుగుణమాల రైతు ఉత్పత్తి దారుల కంపెనీలోని రైతు సభ్యులకు భారతీయ పరిశోధన స్థానం రాజేంద్రనగర్ వరి శాస్త్ర వేత్తలు డా. స్వామి, డా. శ్రీధర్లు ఖరీఫ్ సాగుపై అవగాహన నిర్వహించారు. వరిలో కొత్త ర కం వంగడం డిఆర్ఆర్-48 సాగులో తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివార ణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు సూచించారు. కార్య క్రమంలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ మేనేజర్ గొల్లపెల్లి రత్నాకర్, సర్పంచ్ జయమ్మ సుదర్శన్, మాజీ ఎంపీపీ వెంక టయ్య, మాజీ సర్పంచి భూపతి రాజు, నానాజి పురం లింగం, నర్సింహ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఛైర్మన్ నానాజి పురం ప్రవీణ్, డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు.