Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రవి
నవతెలంగాణ-మర్పల్లి
ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 342, ప్రకారం 101 యూనిట్లు ఉచితంగా అమలు చేయాలని కేవీపీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రవి అన్నారు. బుధవారం మర్పల్లి మండల కేంద్రంలో విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 342 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని కరెంట్ అధికారుల వేధింపులు ఆపాలని తెలి పారు. ఈ జీవోను రాష్ట్ర సీఎం 01-09- 2018న జారీ చేశారని తెలిపారు. ఈ జీవో ప్రకారం ఇప్పటి వరకూ వికా రాబాద్ జిల్లాలోగాని మర్పల్లి మండలంలోగాని ఎక్కడా అమలు చేయడం లేదని ఈ 101 యూనిట్ల నుండి 300 వరకూ ఉచితంగా అమలు చేయాలని లేని పక్షంలో కెేవీపీ ఎస్ తరపున ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రైతులు పాల్గొన్నారు.