Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహేశ్వరం
అక్టోబర్ 15,16వ తేదీల్లో కొత్తూరు పట్టణంలో నిర్వహించనున్న సీఐటీయూ రంగారెడ్డి జిల్లా మూడో మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ కవిత అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో సీఐ టీయూ రంగారెడ్డి జిల్లా మూడో మహాసభల వాల్ పోస్టర్ను సీఐటీయూ మండల కన్వీనర్ ఏర్పుల శేఖర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యమ్రానికి హాజరైన సీఐటీయూ జిల్లా శ్రామిక మహిళ కన్వీనర్ కవిత మాట్లాడుతూ సీఐటీయూ రంగారెడ్డి జిల్లా మూడో మహాసభలు 15, 16వ తేదీల్లో కొత్తూరు పట్టణంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 15వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్తూరు బస్టాండ్ వద్ద బహిరంగ సభ జరుగు తుందన్నారు. కనీస వేతనాల జీవో అమలు కోసం నిర్వహించిన కార్మిక గర్జన పాదయాత్ర కొత్తూరు నుంచి ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న జిల్లా మూడో మహాసభలకు విజయవంతం చేయాలని కోరుతున్నాం. సామాన్యులకు భారంగా మారిన నిత్యవసర సరు కులు ధరలు, కార్మిక కోడ్ల రద్దు కోసం, కాంట్రా క్టీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం సీఐటీయూ అన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పవిత్ర, శోభ, సాబీయా, స్వరూప, ఆశా వర్కర్లు శైలజ, లక్ష్మి, జ్యోతి, చంద్రకళ, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అశోక్, మధ్యాహ్న భోజన కార్మికురాలు కలమ్మ, ట్రాన్స్పోర్టు నాయకులు నరసింహ, పరమేష్ పాల్గొన్నారు.