Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహకార సంఘం చైర్మెన్ రవీందర్‌గౌడ్
నవతెలంగాణ-తాండూరు రూరల్
రైతుల ఆర్థికాభివృద్ధే సహకార సంఘం లక్ష్యమని పీఏసీ చైర్మెన్ రవీందర్ గౌడ్ అన్నారు. గురువారం ఎల్మాకన్నా సహకార సంఘం నుంచి తాండూరు మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే రైతుకు కోపరేటివ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతయ్య ట్రాక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు.గతేడాది సంఘం ద్వారా రైతులకు రూ. కోటిల లోన్లు అందజేసినట్టు తెలిపారు. అంతేకాకుండా కాంట్రాక్టర్‌కు దరఖాస్తు చేసుకున్న శ్రీనివాస్ రెడ్డికి అందరూ 7లక్షల 44 వేల రూపాయలతో ట్రాక్టర్ అందజేసినట్టు పేర్కొన్నారు. రైతులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా రైతులకు రుణాలు అందజేస్తామన్నారు. బ్యాంకు ద్వారా రైతులు ఆర్థికంగా ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈవో శ్రీనివాస్, సిబ్బంది తదితరులున్నారు.