Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నేడు చలో తహసీల్దార్ కార్యాలయం' పాదయాత్రకు తరలిరండి
- వ్యకాసం జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల అంజయ్య
నవతెలంగాణ-యాచారం
రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కౌలుదారు చట్టాన్ని అమలు చేసి బాధిత రైతులకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల అంజయ్య డిమాండ్ చేశారు. గురువారం యాచారం మండల పరిధిలోని నంది వనపర్తి, తాడిపర్తి, కుర్మిద్ధ, సింగారంలో కౌల్ధార్ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సింగారం నుంచి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే రైతుల పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. నాలుగు గ్రామాల రైతులు సింగారం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రలో భాగస్వాములు కావాలని తెలిపారు. 1950 సంవత్సరం నుంచి భూ చట్టం వచ్చిందని, 37/ ఏ సర్టిఫికెట్ ఇచ్చారని, 38/ఈ సర్టిఫికెట్ ఇవ్వకుండా రైతులను మోసం చేసి భూమిని మొత్తం ఓంకారేశ్వర ఆలయం పేరు మీద రాశారని ఆరోపించారు. అప్పటినుంచి సాగు చేస్తున్న పేద రైతులు రక్షిత కౌదారుగా నమోదు చేసి భూ యజమానులు, ఎండోమెంట్ అధికారులు శిస్తు వసూలు చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరగాలంటే తప్పకుండా ప్రభుత్వంతో పోరాటం కొనసాగించాలని, అందుకోసం రైతులంతా ఐక్యంగా ఉండి సింగారం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ నిర్వహించే పాదయాత్రలో రైతులంతా పాల్గొన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భూసాధన కమిటీ కార్యదర్శి రాజిరెడ్డి, అధ్యక్షులు బి.కృష్ణ, సంజీవ, చెన్నారెడ్డి, ఐద్వా మండల కార్యదర్శి అరుణ, నాయకులు పుష్ప, నరసింహ, రాములు, బుగ్గ రాములు, శ్రీశైలం, పరమేష్, గోపాల్, సంతోష, పద్మ, మాధవి, అరుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.