Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకు వివరాలు, సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీల వివరాలు చెప్పొద్దు
- లోన్ యాప్ లింకులను ఓపెన్ చేయొద్దు
- ఈజీ మనీ పేరుతో మోసం
- యువతే లక్ష్యంగా లోన్ యాప్ వల
- సైబర్ మెసేజ్‌లపై జాగ్రత్తగా తప్పనిసరి
- యువత అప్రమత్తంగా ఉండాలి: సీఐ లింగయ్య
నవతెలంగాణ-యాచారం
ఈజీ లోన్ యాప్‌ల ఉచ్చులో పడి యువత మోసపోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తున్నాయి. ప్రజల్లో స్మార్ట్ ఫోన్లు వాడటం ఎక్కువ కావటంతో ఇదే అదనుగా భావించిన ఆన్లైన్ లోన్ యాప్ ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. అమాయక యువతే లక్ష్యంగా యాప్ ద్వారా అకౌంట్లో డబ్బులు జమ చేసి, తర్వాత తిరిగి చెల్లించేందుకు వారిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. వివిధ అలవాట్లు ఉన్న యువత వీటి ఖర్చుల అవసరాల డబ్బు నిమిత్తం వీటి బారిన ఎక్కువగా పడుతున్నారని అక్కడక్కడ వినిపిస్తున్నాయి.గ్రామాల నుంచి పట్టణాల దాకా ప్రజలందరూ ఫోన్ పే, గూగుల్ పే, భారత్ పే, వాట్సప్ పే, పేటీఎం, వాట్సప్ పే వంటి అనేక రకాల ఆకుల ద్వారా ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదే అదునుగా భావించిన ఆన్‌లైన్‌లోనూ యాప్ మోసాలకు ప్రజలు అక్కడక్కడ గురికావడం జరుగుతున్నాయి. రూ.10వేల నుంచి రూ.లక్షా ల వరకూ ఈజీ లోన్లు ఇస్తామని మోసపూరితమైన ప్రకటనలతో యువత భవిష్యత్తు చిత్తు కావడం అక్కడక్కడా వెలుగు చూస్తున్న ఘట నలు చాలా ఉన్నాయి. వీటి బారిన పడి కొంతమంది యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా వీటి పైన యువతకు, ప్రజలకు సరియైన అవగాహన లేకపోవడంతో వీటి బారిన పడుతున్నారు. పోలీసులు ఆన్లైన్ లోన్ యాప్‌తో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్న కూడా, వీటి బారిన కొందరు పడుతున్నారు. ఫోన్ కొచ్చే ఓటిపిలను ఎవరు షేర్ చేయవద్దని పోలీసులు పదేపదే చెబుతున్నారు. తల్లి దండ్రులు తమ పిల్లల పైన నిఘా పెట్టి అప్ర మత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఆన్లైన్ లోన్ యాప్‌ల ద్వారా యువత జాగ్రత్తగా ఉండి వాటికి జోలికి పోవద్దని పోలీసులు కోరుతున్నారు.
ఆన్లైన్లోనే యాప్‌లపై యువత అప్రమత్తంగా ఉండాలి
స్మార్ట్ ఫోన్‌కు వచ్చే ఆన్లైన్ లోన్ యాప్ ల మెసేజ్ లతో యువత అప్రమత్తంగా ఉండాలి. లింకులను ఓపెన్ చేయకూడదు. ఫోన్‌కు వచ్చే ఓటిపి, బ్యాంక్ ఖాతా వివరాలు తెలియని వారికి షేర్ చేయకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లల పైన నిఘా ఉంచాలి. ఈ యాప్ తో యువత మరింత అప్రమత్తంగా ఉండాలి. వాటి జోలికి పోయి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. యువతా తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి.
- సీఐ లింగయ్య