Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్ధాంత్ పట్నాయక్,హెడ్ ఆఫ్ ట్రైనింగ్కె కంస్టాంట్ ఎస్ కే వైవై రైడర్
నవతెలంగాణ-మొయినాబాద్
వాతావరణ, శబ్ద కాలుష్యా నియంత్రణకు ఎలక్ట్రానిక్ వాహనాలు వినియోగించడం మేలని సిద్ధాంత్ పట్నాయక్ ఎస్ కే వై వై హెడ్ ఆఫ్ ట్రైనింగ్ కన్స్టంట్ పేర్కొన్నారు .మొయినాబాద్ మండలంలోని అండాపూర్ చౌరస్తాలోని జేబీఐటి కళాశాలలో మెకానికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏఐసిటిఈ స్పాన్సర్ వర్క్ షాప్ సెషన్స్ నిర్వహిం చారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిద్ధాంత్ పట్నాయక్ మాట్లాడుతూ పెరుగుతున్న వాతావరణ శబ్ద కాలుష్యాన్ని నియం త్రించేందుకు ఎలక్ట్రానిక్ వాహనాలు మానవాళికి మేలు చేస్తాయన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలు వాడ డం ద్వారా పెరిగిన ఇంధన భారం కూడా తగ్గించు కోవచ్చని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి సి కృష్ణమాచారి మాట్లాడుతూ నేటి ఆథునిక సమాజంలో టెక్నాలజీ ఆధారిత వాహనాలను ఉపయోగించేందుకు ప్రజలు మక్కువ చూపు తున్నారని అన్నారు. కార్యక్రమంలో జేబీఐటీఎస్ ఏఈ సొసైటీ ఆఫ్ అమేటివ్ ఇంజనీరింగ్ క్లబ్ ఆధ్వ ర్యంలో జరిగిన వర్క్ షాప్‌నకు సంజరు కుమార్ బలాల్ ఎక్స్పర్ట్ ఇన్ రాపిడ్ ప్రోటో టైప్ ఇన్ ఎస్ కే వై రైడర్ ఎలక్ట్రిక్ ఒడిస్సా వారు హాజరై విద్యుత్ వాహనాల గురించి వివరించారు. ఈ కార్య క్రమంలో డైరెక్టర్ కోఆర్డినేషన్ డాక్టర్ యు వీ ఎస్ ఎన్ మూర్తి, డీఆర్ఎన్ డి డాక్టర్ నీరాజ్ ఉపాధ్యాయ మేక్ హెచ్ ఓ డి డాక్టర్ అనిల్ కుమార్ శుక్ల ప్యాకేజీ నరేంద్ర శ్రీనివాసులు, విద్యార్థులు చేజారామ్ గౌడ్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.