Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి డి.సుధారాణి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
అన్ని గురుకులాలు, వసతి గృహాలలో శుభ్రత పాటించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి డి. సుధారాణి అన్నారు. వికారాబాద్ పట్టణంలోని మైనారిటీ గురుకుల బాలికల కళాశాలలో మైనారిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి షఫీ ఉల్లా ఆధ్వర్యంలో గురువారం అన్ని గురుకులాల, వసతి గృహాల హెల్త్ సూపర్వైజర్లు, శారటేషన్ వర్కర్లకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత విద్యార్థులకు ఆరోగ్యం పౌష్టికాహార పై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురుకులాలు, వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని, విద్యార్థులకు నిరంతరం ఆరోగ్య విషయంలో పర్యవేక్షణ హెల్త్ సూపర్వైజర్లు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీసీడీవో భీమ్ రాజు, డీఎస్సీబీవో ఎన్ మల్లేశం, సెక్టోరియల్ ఆఫీసర్ ఎం.డి. యాసిన్, జీసీడీవోపీ సంధ్య, ఎస్ఎల్బి ప్రిన్సిపాల్ రమణమ్మ, మైనారిటీ బాలుర ప్రిన్సిపాల్ పకీరప్ప, మైనారిటీ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ జి స్వాతి, మైనారిటీ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ కే. అనుష, పాల్గొన్నారు.