Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నోజిగూడ గ్రామస్తులు ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు
నవతెలంగాణ-కందుకూరు
కందుకూరు మండల్ అన్నోజిగూడ గ్రామ ఆవరణలో ఉన్న బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాకి దశరథ ఆధ్వర్యంలో గురువారం అన్నోజిగూడ గ్రామస్తులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాటరీ సైక్లింగ్ కంపెనీ వల్ల సమీపంలో ఉన్న చెరువులో కంపెనీ నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు చెరువులో చేరడంతో ఈ నీరంతా కాలుష్యమవుతోందన్నారు. పొగ కాలుష్యం వెదజల్లడం వల్ల ,గ్రామస్తులు కూడా అనారోగ్యపాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి పొల్యూషన్ బోర్డ్ అధికారి ఏఈ శరత్ చంద్రకు ఫోన్ ద్వారా సమాచార అందించి కంపెనీ ద్వారా వెదజల్లే వ్యర్థ రసాయన పదార్థాలు తీసుకుని పరీక్ష చేయాలని ఆదేశించారు. పొల్యూషన్ బోర్డ్ ఏఈ శరత్ చంద్ర బ్యాటరీ సైక్లింగ్ కంపెనీ వద్దకు వెళ్లి, వ్యర్థ రసాయనాలను సేకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, నియోజకవర్గ ఉపాధ్యక్షులు లక్ష్మీ నరసింహ రెడ్డి, టీఆర్ఎస్ యువజన సంఘం ఉపాధ్యక్షులు గోరింకల రామకృష్ణ, సీనియర్ నాయకులు గోరింకల యాదయ్య, గ్రామస్తులు కృష్ణ ,గణేష్, మహేందర్, ప్రభు దాస్, సురేష్, దేవేందర్, పరమేష్, రాజు, మహిపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు.