Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కొండాపూర్ డివిజన్ పరిధిలోని మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ హార్ట్ డే (ప్రపంచ హృదయ దినోత్సవం ) కార్యక్రమంలో భాగంగా మెడికవర్ హాస్పిటల్ నుండి హైటెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ వారు అవగహన ర్యాలీ ని నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. ప్రస్తుత రోజులలో గుండె సంబంధిత వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారని సరైన అవగాహన లేక గుండె జబ్బులకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా మారిన జీవన శైలితో పాటు, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి సరైన వ్యాయామం చేయకపోవడం వలన గుండె సంబంధిత వ్యాధులకు గుర వుతున్నారని తెలిపారు.కావున చిన్న ,పెద్ద తేడా లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని అన్నారు. కావున ప్రజలు సరైన అవగహన కలిగి ఉండి, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, మానసిక ఒత్తిడిని యోగ ద్వారా అధిగమించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చిన మెడికవర్ హాస్పిటల్ యజమాన్యాని ప్రత్యేకంగా అభినదించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమా న్యం, వైద్యులు, సిబ్బంది, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు సాయి, తదితరులు పాల్గొన్నారు.