Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోర్కుమార్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ మహిళల ఆత్మగౌర వానికి ప్రతీక బతుకమ్మ అని, మహిళ లందరూ ఆనందంగా అత్యంత వైభవోపేతంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని జిల్లా కలెక్టర్ అమోరుకుమార్ అన్నారు. గురు వారం సమీకృత కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా ఐద వ రోజు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ వేడుక ల్లో జిల్లా కలెక్టర్ అమోరుకుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియలతో కలి సి పూజలు నిర్వహించి, వేడు కలను ప్రారంభించారు. అనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆనందాలను, ఆప్యాయతలను పంచ డమే కాకుండా బతుకమ్మ పండుగ విలువలకు అద్దం పడుతుం దన్నారు. బతుకమ్మ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే ఆచారం సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ఈ పండుగను మహిళలు ఎంతో ఆనం దంగా ఉత్సాహంగా జరుపుకుం టారని, మహిళా స్వావలంబన చెందాలనే గొప్ప ఆశయం బతుకమ్మ సంబురాలల్లో ఉందన్నారు. బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవా నికి ప్రతీక అని కొనియాడారు. ఈ సంద ర్భంగా ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ప్రపంచ వయో వృ ద్ధుల దినోత్సవం సం దర్భంగా కలెక్టర్ అమోరు కుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ వేడుకలలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి మోతి, ఏఓ ప్ర మీల, జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగు లు, వివిధ మండ లాల సీడీపీఓలు, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.