Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకరపల్లి
డ్వాక్రా గ్రూపు రుణాలను మహిళలందరూ సద్విని యోగం చేసుకోవాలని మహారాజ్పేట్ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మహారాజ్పేట గ్రామంలో గురువారం డ్వాక్రా మహిళలకు చెక్కులను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహి ళలందరూ ఆర్థికంగా ఎదగడానికి డ్వాక్రా సంఘాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. మహి ళలందరూ కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి డబ్బులు జమ చేసుకొని వారి కుటుంబాలను పోషించుకుంటూ వ్యాపారా లు కూడా చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారని అన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారా లు అందిస్తుందని అన్నారు. డ్వాక్రా మహిళలందరూ పొదుపులు చక్కగా చేసుకుని జీవనం సాగిస్తూ తిరిగి బ్యాంకులకు సక్రమంగా చెల్లిస్తే మరిన్ని రుణాలు ఎక్కువ గా ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుజాత నరసింహచారి, వార్డు సభ్యులు శ్రీకాంత్, శ్రీనివాస్, దశరథ్, గ్రామ కార్యదర్శి రమ్య, ఏపీఎం భీమయ్య, సీసీ అశోక్, డ్వాక్రా సంఘాల సభ్యులు పద్మమ్మ, ఊర్మిళ, యాదమ్మ, మౌనిక, పార్వతమ్మ, వినోద, సుగుణమ్మ, సరిత ఉన్నారు.