Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ వెంకటేష్ యాదవ్
నవతెలంగాణ-కోట్పల్లి
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వహిస్తుందని బార్వాద్ సర్పంచ్ వెంకటేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం కోట్పల్లి మండల పరిధిలోని బార్వాద్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న బతుకమ్మ పండుగ చీరల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ వెంకటేష్ యాదవ్, ఉపసర్పంచ్ సంగారెడ్డి, ఎంపీటీసీ నర్సింహారెడ్డి, వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మసీయోద్దీన్, వార్డు మెంబర్ బారతమ్మ, నాయ కులు మైనోద్దీన్, శ్రీకాంత్ రెడ్డి, అనంతయ్య, బీమయ్య, అంజయ్య, పెంటయ్య, వీరయ్య, నర్సింలు, ఏసు, మహిళ సంఘాల అధ్యక్షరాళ్లు నాయకులు మహిళలు తదితరు లు పాల్గొన్నారు.