Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీయస్ చైర్మన్ బండ విష్ణువర్ధన్ రెడ్డి
నవతెలంగాణ- మోమిన్‌పేట
ప్రాథమిక సహకార సంఘం లాభాల బాటలో పయ నిస్తోందని పిఏసిఎస్ చైర్మెన్ బండ విష్ణువర్ధన్ రెడ్డి అన్నా రు. శుక్రవారం చైర్మన్ బండ విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘంలో రుణాలు తీసు కున్న రైతులు సకాలంలో రుణాలు రెన్యువల్ చేసుకున్న వారికి రుణమాఫీ వర్తిస్తుందన్నారు. అందుకు రైతులు తీ సుకున్న పంట రుణాలను ప్రతి ఏడాది రెన్యువల్ చేసు కోవాలన్నారు. ప్రభుత్వం రైతుల పక్షపాతి అందుకు దశల వారిగా రుణమాఫీ చేస్తుందని అందుకు రైతులు ఎలాంటి ఆందోళనలూ చెందకూడదని, మాఫీ అందరికీ వర్తిస్తుం దని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అందుకుగాను నా బార్డు కళాబృందం వారిచేత సైబర్ నేరాల పై అవగాహన కల్పించామని, అందుకు రైతులు అపరిచిత మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సంఘానికి త్వరలోనే నూత న భవన నిర్మాణం చేపడతామని గతంలో కంటే సంఘాన్ని డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులకు అండగా ఉంటామన్నారు. సాహకార సంగంలో బంగారు ఆభరణాలపై రుణాలు, హౌమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్, వంటి సదుపాయాలు కల్పించడం జరిగిందని అందుకు ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, సీఈవో శేఖర్, డైరెక్టర్లు బుచ్చిరెడ్డి పాపిరెడ్డి, ఆయా గ్రామాల ఖాతాదారులు, రైతు లు, సిబ్బంది బాలయ్య, నారాయణరెడ్డి, రవికుమార్ రమే ష్, మహమూ తదితరులు పాల్గొన్నారు.