Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-మర్పల్లి
గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మ్మెల్యే జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మండలంలోని మల్లికార్జున గిరి గ్రామంలో శుక్ర వారం 'మీతో నేను' కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. గ్రామంలో ఆయా వార్డుల్లో పర్యటించి గ్రామస్తుల సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ లక్ష్మయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ సీఎం కేసీఆర్ కల్పించిన సువర్ణావకాశంతో మల్లికా ర్జునగిరి గ్రామం నూతన గ్రామపంచాయతీగా ఏర్పడింద న్నారు. ప్రజల అవసరాలకు అనుగూణంగా 3 ప్రదేశాల్లో మినీ ట్యాంకులు (సింటెక్స్)లు నిర్మించి, వాటికి నల్లాలు బిగించాలని సంబందితశాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ తాగునీటి పైపులైన్లు ఎక్కడా లీకేజీలు లేకుండా, ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. నెలలో 3 సార్లు 1, 11, 21వ తేదీల్లో మిషన్ భగీరథ తాగునీటి ట్యాంకులను కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు. గ్రామం లో అవసరమైనచోట నూతన స్తంభాలు ఏర్పాటు చేసి వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, పంట పొలాల వద్ద వేలాడుతున్న విద్యుత్తీగలను సరిచేయా లన్నారు. గ్రామంలో నూతనంగా మురుగు కాలువలు, సీసీరోడ్ల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. గ్రామంలో ప్రతీ మంగళవారం ఉదయం 9 గంటలకు పశువుల డాక్టర్ అందుబాటులో ఉండాలని పశువైద్య అధికారులను ఆదే శించారు. అనంతరం గ్రామంలోని ఆడపడుచులకు బతు కమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి ఎంపీడీవో జగన్నాథ్ రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లేశం, రైతుబంధు అధ్యక్షుడు నాయక్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు ఆయాశాఖల అధికారులు, నాయకులు కార్య కర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.