Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
- రెండు మేకల మృత్యువాత
- తృటిలో తప్పించుకున్న రైతు లింగం
రైతును ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు సాయిబాబు డిమాండ్
నవతెలంగాణ- కొత్తూరు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు మేకలు మృత్యువాత పడిన ఘటన నందిగామ మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నందిగామ మండల కేంద్రానికి చెందిన కుమ్మరిలింగం మే కల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నాడు. శుక్ర వారం తన మేకలను తోలుకుని రైతు శ్రీనివాసరెడ్డి పొలం లోకి మేతకు వెళ్లాడు. శుక్రవారం భారీ వర్షం కురవడంతో విద్యుత్ వైర్లు తెగి కిందపడిపోయి ఉండడంతో సుమారు 30 వేలు విలువచేసే 2 మేకపోతులు విద్యుత్ షాక్కు గురై మృత్యువాత చెందాయి. రైతు లింగం సైతం తృటిలో తన ప్రాణాలను దక్కించుకున్నాడు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
గతంలో విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సిబ్బంది తీగలు వేలాడే విధంగా తూతూ మంత్రంగా మర మ్మతులు చేప ట్టి వదిలేశార ని రైతు శ్రీని వాస్ రెడ్డి తెలి పారు. గమ నించని రైతు లింగం తన మేకలను అక్కడి పొలంలోకి తీసుకుపోయాడు. శుక్రవారం కురిసిన వర్షానికి విద్యుత్ తీగలు నేలపై పడిపోయి ఉండడంతో అక్కడే మేతమే స్తున్న మేకలు విద్యుత్ తీగలపై వెళ్లడంతో షాక్ తగిలి అక్కడి కక్కడే ప్రాణాలు వదిలాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన మేకలు చనిపోయాయని ప్రభు త్వం తనకు ఆర్థిక సాయం అందజేసి తనను ఆదుకోవాలని రైతు కోరారు.
రైతును ఆదుకోవాలి :సీఐటీయూ
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డ మేకల యాజమాని రైతు లింగంను వెంటనే ప్రభు త్వం ఆర్థికంగా ఆదుకోవాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి బీసా సాయిబాబు ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన రైతు లిం గం ప్రాణాలు సైతం పోయేవని ఆయన ఆవేదన వెలి బు చ్చారు. విషయం తెలిసిన సీఐటీయూ నాయకులు కొంగ రి నరసింహ సీపీఐ(ఎం) నాయకులు ప్రవీణ్ రైతు లింగం ను పరామర్శించారు.