Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సింగపాగ జంగయ్య మాదిగ
నవతెలంగాణ-షాద్నగర్
ఈ నెల 23వ తేదీన హైదరాబాద్లో జరిగే మాదిగల ఆత్మీయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండని టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సింగపాగ జంగయ్య మాదిగ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్ట ణంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా దమాషా ప్రకా రం రిజర్వేషన్లు అందరికీ సమానంగా చెందాలంటే ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ ద్వారానే అందరికీ సమాన రిజర్వేషన్లు అందుతాయన్నారు. బీజేపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయిందన్నారు.బీజేపీ ప్రభుత్వం పై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైంద న్నారు. మాదిగల ఆత్మీయ అలారు బలారు కార్యక్రమాని కి మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సిర్శనోళ్ళ బాల్ రాజ్ మాదిగ, జేఏసీ జిల్లా అధ్య క్షులు బొర్ర సురేష్ మాదిగ, తుపాన్ శ్రీను,అంజి పాల్గొన్నారు.