Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య
నవతెలంగాణ-పరిగి
ప్రభుత్వ భూములలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వా లని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకట య్య అన్నారు. శుక్రవారం పరిగి పట్టణ కేంద్రంలోని తహాసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం), వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 12వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు బుస్స చెంద్రయ్య, ఎం.వెంకటయ్య, మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో ఉన్న పేదలందరికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని 12 రోజులుగా పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్న, ప్రభుత్వం స్పందించ కుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం బాధాకరమ న్నారు. పరిగి మండలం రంగాపూర్, పరిగి పట్టణంలోని శిఖం, ఇనాం, నారాయణపూర్ రెవెన్యూ గ్రామం పరిధిలో ని స్టీల్ ఫ్యాక్టరీ ఆక్రమించుకున్న భూదాన్ ప్రభుత్వ భూములలో పేదలకు 120 గజాల ఇండ్ల స్థలాల్లో ఇవ్వా లని డిమాండ్ చేశారు. ఇండ్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, అర్హులైన పేదలం దరికీ డబల్ బెడ్ రూమ్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం), వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ నా యకులు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం మండల కన్వీనర్ హబీబ్, సత్యయ్య, కృష్ణ, లాలయ్య, బసిరెడ్డి, శేఖర్, రఘరం, శీను, అంజన్న, సత్తాన్నా, పెంటయ్య, వెంకటేష్, కె. శ్రీను నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.