Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-మర్పల్లి
ఆడబిడ్డల క్షేమానికి ఆదర్శవంతమైన సంక్షేమ పథకా లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వికారాబాద్ ఎమ్మెల్యే జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనం ద్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం హాల్లో లబ్దిదారులకు షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను 21 మందికి ఆయన అందించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తు న్నారన్నారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభు త్వ పథకాలను అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుం దన్నారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపి ణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బట్టు లలిత రమేష్, జడ్పీటీసీ, మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, ఎంపీడీవో జగన్నాథ్ రెడ్డి, తహసీల్దార్, రైతుబంధు అధ్యక్షుడు నాయ బ్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ఆయాగ్రా మాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గఫార్, సహకార సంఘం డైరెక్టర్ యాదయ్య, నాయకులు గోపాల్ రెడ్డి, గౌస్, మధుకర్, అశోక్, రాచ య్య, వసంత్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.