Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
పౌర హక్కులపై ప్రజలు అవగాహన తప్పనిసరిగా కల్పించాలని ఎస్ఐ రవిగౌడ్ అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని పెద్ద నందిగామ గ్రామంలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామస్తులకు, అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రజలు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజం లో మార్పు వస్తుందన్నారు. కుల వివక్ష లేకుండా గ్రామంలో అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు. అంట రానితనం అమానుషమైన చర్యలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏండ్లు దాటితేనే వివాహాలు జరిపించాలని, నిబంధనలకు విరుద్ధంగా వివాహాలు జరిపించాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్రమ త్తతతో రహదారి ప్రమాదాలను నివారించవచ్చని, ప్రపంచంలో జరుగుతున్న మరణాల్లో అత్యధిక శాతం మానవ తప్పిదాలతోనే వాహనాల ప్రమా దాలు జరుగుతున్నాయని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు నిబం ధనలు పాటిస్తూ, నిదానమే ప్రధానంగా వాహనాలు నడపాలని కోరారు.అంతేకాకుండా మద్యం తాగి వాహనం నడపవద్దని కోరారు. హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ జూని యర్ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.