Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల పీఎసీఎస్ అధ్యక్షులు దేవర వెంకట్రెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
పీఏసీఎస్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చేవెళ్ల పీఏసీఎస్ అధ్యక్షులు దేవర వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం పీఏసీఎస్ కార్యాలయంలో పాలక మండలి సర్వసభ సమావేశం నిర్వహించారు. కొత్తగా 34 మంది రైతులకు రూ.23 లక్షలు రుణాలు అందజేశారు. రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. రైతులు తీసుకున్న రుణాలు, సకాలంలో చెల్లిస్తే, తక్కువ వడ్డీ పడుతుందని తెలిపారు. పీఏసీఎస్ పరిధిలోని రైతులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు అందజేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా బంగారంపై రుణాలు, వ్యాపారస్తులకు,అందజేస్తున్నట్టు చెప్పారు. డైరెక్టర్ల అందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకుని చేవెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లాలో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఉపాధ్యక్షులు చిలుకూరి వెంకటేష్, డైరెక్టర్లు బండారి సువర్ణ, పాటి దామోదర్ రెడ్డి, మధ్యల లక్ష్మమ్మ, నత్తి కృష్ణారెడ్డి, కవ్వా గూడెం ప్రతాప్ రెడ్డి, పోతుగంటి రాములు, దవల్ గారి అంజి రెడ్డి, ఎ.నర్సింలు, శ్యామలయ్య, సొసైటీ సీఈవో వెంకటయ్య, సహకార సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.