Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్వారక ఘట్టం ప్రదర్శన
నవతెలంగాణ-కల్చరల్
అదిగో ద్వారక, ఆల మంద లవిగో అని అర్జున పాత్రధారి జంగయ్య గౌడ్ వయస్సును అధిగమించి రాగాలాపన చేస్తూ పాడిన పద్యానికి శ్రోతలు పులకించారు. భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో కల్పన కళా నికేతన్ నిర్వ్యహణలో దేవీ నవ రాత్రోత్సవ్ సందర్భంగా పార్సిగుట్ట వద్దనున్న బద్ది పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో తిరుపతి వెంకట కవుల కష్ణ రాయబారం పద్య నాటకం నుంచి ద్వారకా ఘట్టంను ప్రదర్శించారు. శ్రీకృష్ణునిగా జీడీ నాయుడు ఆహార్యం నటనలో ఆకట్టుకోగా, దుర్యోధనుని సంజీవ గంభీర సంభాషనతో ప్రశంస పొందారు. చంద్రబాబు నాయుడు నేపధ్య సంగీతం శ్రావ్యంగా ఉంది. ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి ఆకుల అరుణ కుమార్ అతిధిగా పాల్గొన్నారు.