Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణికొండకు 9వ, నార్సింగి 8వ ర్యాంకులు
- ఉత్తమ కార్మికులకు ప్రశంస పత్రాలు
- మణికొండ ఛైర్మెన్ కస్తూరి నరేందర్
నవతెలంగాణ-గండిపేట్
మణికొండ మున్సిపాలిటీలోని పరిశుభ్రత, అభివృద్ధిలో మొదటి ర్యాంకులో తీసుకరావాలని చైర్మన్ కస్తూరి నరేందర్, వైష్ చైర్మన్ నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మణికొండ మున్సిపాలిటీ స్వచ్ సర్వేక్షణ్ల్లో ఈ ఏడాది దక్షణాది రాష్ట్రాలకు గాను మణికొండ 9వ ర్యాంక్ సాధించినట్టు తెలిపారు. కార్మికులు, సిబ్బంది సహాకారంతో మరింత ముందుకేళ్లాలన్నారు. స్వచ్ సర్వేక్షణ్ల్లో నిత్యం సేవలందించిన కార్మికులను గుర్తించారు. శ్రమను గుర్తించి బెస్టు కార్మికులకు ప్రశంస పత్రాలతో పాటు సన్మానించారు. రాబోయో రోజుల్లో మణికొండను స్వచ్ సర్వేక్షణ్ల్లో మొదటి స్థానంలోకి తీసుకరావాలని ఆకాంక్షించారు. కార్మికులు, సిబ్బంది, అధికారులు నిత్యం శ్రమించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సిబ్బంది మరింత పని చేయాలి : ఛైర్పర్సన్ రేఖాయాదగిరి
నార్సింగి 8వ ర్యాంక్ రావడంతో పాలక వర్గ సభ్యులు ఆసంతృప్తి చెందారు. స్వచ్సర్వేక్షణ్ల్లో అధికారులు మరింత చొరవ చూపాలన్నారు. శానిటేషన్ అధికారుల లోపంతో నార్సింగి మున్సిపాలిటీ 8వ ర్యాంక్‌కు చేరిందన్నారు. శానిటేషన్ల్లో మరింత ఫలితాలను సాధించాలన్నారు. వార్డుల్లో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో మొక్కల తోట్లను శుభ్రం చేయించారు. స్వచ్ సర్వేక్షణ్ కోసం మున్సిపల్ అధికారులు మరింత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ వెంకటేష్‌యాదవ్, కౌన్సిలర్ గున్నాల అమరేందర్‌రెడ్డి, శానిటేషన్ సూఫర్ వైజర్ లచ్చిరాం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.