Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
మహాత్మగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు మాలతి కృష్ణారెడ్డి, ముడిమ్యాల్ గ్రామ సర్పంచ్ శేరి స్వర్ణలత దర్శన్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల్ గ్రామంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలంటే గాంధీజీ సిద్దాంతాలే అచరణయమని, అహింసా వాద సిద్దాంతంతో గాంధీజి ప్రపంచంలో అతి శక్తివంతమైన వ్యక్తిగా గుర్తించబడ్డారన్నారు. గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముడిమ్యాల్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 జయంతిని పురస్కరించుకొని గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని కి సర్పంచ్ స్వర్ణలత దర్శన్ క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా విగ్రహానికి పూలమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా సర్పంచ్ స్వర్ణలత దర్శన్ మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సూర్యాపేట స్వరూప, ఉప సర్పంచ్ జహీరా బేగం, వార్డ్ సభ్యులు యు వెంకటేష్, శివ కుమార్, జె గోపమ్మ, ఎం సతీష్ గౌడ్, జి లావణ్య, వై రవీందర్, జి లక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు జి మోహన్ రెడ్డి, కె సునీత, ఎం సుధాకర్ గౌడ్, యువ నాయకులు, యువకులు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.