Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ వై రవీందర్ యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య లక్ష్యమని ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. ఆదివారం కేశంపేట మండలం భైరాన్పల్లి, మంగలిగూడెం, అల్వాల, చౌలపల్లి గ్రామాలలో దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీతోపాటు జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ కుమార్ రెడ్డిలు హాజరై చీరల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివద్ధి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా నిర్వహించే దేవీ నవరాత్రి ఉత్సవాలను, బతుకమ్మ సంబురాలను మహిళలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కృష్ణయ్య, ఇందిరమ్మ, శ్రీలత శ్రీనివాస్, వీరేశం, వెంకట్ రెడ్డి, నవీన్ కుమార్, ఎంపీటీసీలు మల్లేష్, యాదయ్య, షాద్నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీ నారాయణగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, నాయకులు ఆవుల వెంకటేష్, ఆనపూసల సత్యనారాయణ,శానమొని శ్రీశైలం, ఆవుల యాదగిరిలతోపాటు తదితరులు పాల్గొన్నారు.