Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డిడెస్క్
భారతదేశ వ్యాప్తంగా శరద్ నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పండుగను విభిన్న రకాలుగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలకు, తొమ్మిది రోజులు , తొమ్మిది రూపాలలో కనిపించే అమ్మవారిని పూజించే వైభవోపేత కాలమిది. దేశంలోని ప్రాంతాలను బట్టి అమ్మవారిని దర్శించే రూపాలు కూడా విభిన్నంగా ఉండవచ్చు కానీ ఈ తొమ్మిది రోజులూ అపారమైన శక్తిసంతరిస్తుందని మాత్రం ప్రతి ఒక్కరూ నమ్ముతుంటారు. ఈ రోజులలో కనిపించే రంగులు ప్రతి ఒక్క దానికీ ఓ ప్రాముఖ్యత ఉంటుంది. పూజా కార్యక్రమాలలో ప్రత్యేకతనూ అది తీసుకువస్తుంది. తెలంగాణాలో, సంస్కృతి, సంప్రదాయం, ప్రజలు, నమ్మకాలకు ప్రతీక అయిన నవరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత సైతం ఉంటుంది.''పండుగ సమయాలలో భారతదేశంలో ఆయా ప్రాంతాల సాంస్కృతిక వైభవం మరింతగా కనిపిస్తుంది. తరతరాలుగా సంప్రదాయాలను పాటించడం వీటిలో మరింత ప్రత్యేకం'' అని మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్ అండ్ మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్ అన్నారు. ప్రతి ఒక్కరికీ ఈ దసరా సంతోషం తీసుకురావాలని ఆకాంక్షించారు.