Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
మహాత్మగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ముడిమ్యాల్ పీఏసీఎస్ ఛైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముడిమ్యాల్ గ్రామంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి వేరు వేరుగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలంటే గాంధీజీ సిద్దాంతాలే అచరణయమని, అహింసా వాద సిద్దాంతంతో గాంధీజి ప్రపంచంలో అతి శక్తివంతమైన వ్యక్తిగా గుర్తించబడ్డారన్నారు. గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశానికి శాంతియుత మార్గంలో స్వాతంత్య్రం తెచ్చిన వ్యక్తి గాంధీ అని కొనియాడారు. ఆయన స్పూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సున్నపు వసంతం, గుండాల రాములు, ముడిమ్యాల్ గ్రామ మాజీ సర్పంచ్ ప్రభాకర్, చేవెళ్ల ఉప సర్పంచ్ గంగి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, ఇరమోళ్ల మల్లేష్, గాయసుద్దీన్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు దేవర సమతావెంకట్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, మాణిక్యం శ్రీనివాస్, శ్రీనివాస్, కో-అప్షన్ సభ్యులు నారాయణ, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది కేసారం యాదయ్య, ఎం.యాదయ్య తదితరులు ఉన్నారు.