Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
గాంధీ 153వ జయంతిని పురష్కరించుకున్ని మున్సిపాలిటీలో వేడుకలను నిర్వహించారు. ఆదివారం గండిపేట్ మండలం నార్సింగి, మణికొండ, బండ్లగూడ మున్సిపాలిటీ ఆఫీసుల్లో అధికారులు. పాలక వర్గ సభ్యుల సమక్షంలో అధికారికంగా నిర్వహించారు. గాందీ, లాల్ బహాదూర్ శాస్త్రీ చిత్రపటాలకు పూలమాలేసీ ఘనంగా నివాళ్లు ఆర్పించారు. నార్సింగి చైర్పర్సన్ రేఖాయాదగిరి, వైస్ ఛైర్మెన్ వెంకటేష్‌యాదవ్, మణికొండల్లో ఛైర్మెన్ కస్తూరీ నరేందర్, వైస్ ఛైర్మెన్ నరేందర్‌రెడ్డి, బండ్లగూడల్లో మేయర్ మహేందర్ గౌడ్, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి సమక్షంలో నివాళుర్పించారు. వారి త్యాగాలను గుర్తి చేసుకున్ని స్మరించుకున్నారు. వారి అడుగు జాడల్లో నడవాలని కొనియాడారు. నార్సింగి మంచిరువుల ప్రధాన చౌరస్తాల్లో ఆర్పీలు మసరత్ సమక్షంలో గాంధీ విగ్రహానికి వివాళ్లు ఆర్పించారు. కార్యక్రమంలో కమిషనర్లు వేణుగోపాల్‌రెడ్డి, సత్యబాబు, పాల్గున కుమార్, డీఇలు యాదయ్య, నర్సింహారాజు, మేనేజర్లు యోగేష్, మల్లారెడ్డి, వైష్ ఛైర్మెన్లు నరేందర్‌రెడ్డి, వేంకటేష్యాదవ్, కౌన్సిలర్లు అమరేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో
బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి సమక్షంలో హైదర్షాకోట్ కస్తూర్బా గాంధీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళ్లు ఆర్పించారు. ఈ కార్యక్రమానికి టీ పీసీసీ సభ్యులు బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజు ముఖ్యులుగా పాల్గొని వారి సేవలను స్మరించారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, ఎ బ్లాక్ అధ్యక్షులు డి. నవీణ్‌కుమార్, తలారి ప్రేంకుమార్, అంకం శ్రీనివాస్, గణేష్. టింకురెడ్డి, విష్ణు, రవికాంత్ సుధాకర్, లక్ష్మణ్, ఎట్టయ్య, బాల్‌రాజు, నర్సింగ్‌రావ్, శంకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.