Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం యాచారం మండల పరిధిలోని మల్కీజ్ గూడకు చెంది న ఓర్పు జంగయ్య కు రూ.60 వేలు, రెడ్డమొని బుచ్చ య్యకు రూ. 57వేలు, కావలి సాయిలు కు రూ.24వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం మల్కీజ్ గూడకు చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ గ్రామాల్లో టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్తకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, బిలకంటి శేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ డేరంగుల శారదా శంకర్, టిఆర్ఎస్ నాయకులు అబ్బయ్య, రామకష్ణ, అనంతరెడ్డి, శ్రీశైలం, అనసూయ, జయమ్మ, ప్రమీల, కష్ణయ్య, మల్లేష్, పాండు, శ్రీకాంత్ రెడ్డి, రాజశేఖర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.