Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పలి మల్కయ్య
నవతెలంగాణ- యాలాల
ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పాలకులు అమలు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర సంఘం కార్యవర్గ సభ్యులు ఉప్పలి మల్కయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కేవీపీఎస్ సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులను కేటాయించాలని పేర్కొన్నారు. 1998లో కేవీపీఎస్ సం ఘం ఏర్పడిందన్నారు. సంఘం అధ్వర్యంలో ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి అనేక విజయాలను సాధించినట్టు తెలిపారు. నిష్పక్షపాతంగా దళితబం ధు పథకాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప, నాయకులు నర్సింలు, రమేష్, శ్రీనివాస్, రాజు, అంజిలయ్య, సాయిలు, మల్కయ్య, యాదప్ప, తదితరులు పాల్గొన్నారు.