Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు
- నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
- వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో డీవైఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల ను మోసం చేస్తున్నాయని అన్నారు. దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వ విధానాలే కారణమ న్నారు. దేశంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వీటికి ప్రభుత్వం ఇప్పటికీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయటం లేదని అన్నారు. కనీస ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వెంటనే వీటికి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చే స్తామని ప్రతిసారి ప్రభుత్వం మాటలు చెబుతుం దన్నారు. కానీ ఆచరణలో ఒక్క అడుగు కూడా వేయ డం లేదన్నారు. యువశక్తిని సక్రమంగా వినియోగిం చుకుంటే దేశం అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో ప్రభుత్వాలు యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా దేశంలో నిరుద్యోగం పెరుగుతుం దన్నారు. ప్రభుత్వాలు తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు.
డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా పి.జగన్
అనంతరం డీవైఎఫ్ఐ రం గారెడ్డి జిల్లా నూతన కార్యద ర్శినీ ఎన్నుకున్నారు. ఇబ్రహీం పట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన పి.జగన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ఆయన ఎస్ఎఫ్ఐ రా ష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి పలు హౌదాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ యువజన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమిస్తామని తెలి పారు. ఉద్యోగ నోటిఫికేషన్ సాధన కోసం అవిశ్రాంత పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలువేరు రాజు, జిల్లా అధ్యక్షులు జక్కిడి అనిల్ రెడ్డి, నాయకులు ఆలంపల్లి జంగయ్య, స్వామి, శివ శంకర్, లెనిన్, హఫీజ్, లింగస్వామి, దినేష్ విప్లవ్, ప్రభు, విజరు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.