Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిపాడిన మహిళా మణులు
నవతెలంగాణ-గండిపేట్
నార్సింగి, బండ్లగూడ, మణికొండ మున్సిపాలిటీల్లో 9వ రోజుల పాటు బతుకమ్మ సంబురాలను రంగవైభవంగా నిర్వహించారు. రాష్ట్ర పండుగను ప్రతి ఏడాది సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూలతో పూజించే పండుగతో మహిళలు రంగు రంగుల పూలు, పట్టు చీరలతో అందంగాముస్తాబైన మహిళా మణులు తీరుకో పాటతో తీరుకో స్టేపులేశారు. నార్సింగి 17 వార్డుల్లో కౌన్సిలర్లు ఉషమ్మ, అరుణజ్యోతి, లక్ష్మీప్రవళికకిరణ్, మణికొండ మున్సిపలిటీల్లో మహిళా టీఆర్ఎస్ అధ్యక్షురాలు రూపారెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు అంబురాన్ని తాక్కాయి. మంచిరేవుల గ్రామంల్లో కౌన్సిలర్ నాగపూర్ణ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మెకల ప్రవీన్యాదవ్ సమక్షంలోని వేడుకలను నిర్వహించారు. సింగిల్ విండో డైరెక్టర్ కమలపల్లి విష్ణువర్థన్‌రెడ్డి గౌరమ్మను తలపై పెట్టుకున్ని స్టేపులేశారు. అందరి సమక్షంలో నిమజ్జనం చేశారు. గౌలిదొడ్డిల్లో ఛైర్పర్సన్ రేఖాయాదగిరి, వట్టినాగులపల్లి కౌన్సిలర్ యాదమ్మ, ఖానాపూర్‌ల్లో మాజీ సర్పంచ్ రామేశ్వరం నర్సింహా, కౌన్సిలర్ గున్నాల అమరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్ సమక్షంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. బండ్లగూడ హైదర్షా కోట్‌ల్లో డిప్యూటీ మేయర్ రాజేం దర్‌రెడ్డి, కార్పొరేటర్లు, గంధంగూడ, బైరాగిగూడల్లో కార్పొరేటరు తలారి చంద్రశేఖర్ సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.