Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ-గండిపేట్
మాజీ మంత్రి వర్యులు స్వర్గీయా పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఇంద్రారెడ్డి జయంతి వేడుకలను పురష్కరించుకున్ని దర్గా ఖలీజాఖాన్ల్లో ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలేసీ ఘనంగా నివాళ్లు ఆర్పించారు. తమ నాయకుడని కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ సభ్యులు జ్ఞానేశ్వర్ వారితోనే రాజకీయా ఓనమాలు నేర్చుకునమంటూ, నాయకులు తమ నాయకుడని అధికార పక్షం, ఇరు పార్టీల నాయకులు కలిసి నివాళ్లు ఆర్పించారు. వారి ఆశయాకగుణంగా పని చేస్తామని నాయకులు కొనియాడారు. రంగారెడ్డి జిల్లాకు చేసిన సేవలు ఎన్నో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి తనయుడు యువనాయకులు కార్తీక్‌రెడ్డి, నవాబుముంతాజ్, అంజనేయులు, నవీణ్‌కుమార్, కృష్ణారెడ్డి, కొరివి గణేష్, బొర్రా గోపాల్, బోగాల శ్రీనివాస్ అంకం శ్రీనివాస్, టింకురెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, తలారి ప్రేంకుమార్, కార్పొరేటర్లు ముద్దం రాము, సాగర్ గౌడ్, ఆస్లాంబిన్, ఖాజా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కౌకుంట్లకేళ్లిన మణికొండ మహిళా టీఆర్ఎస్ అధ్యక్షురాలు రూపారెడ్డి
స్వర్గీయా ఇంద్రారెడ్డి జయంతిని పురష్కరించుకున్ని మణికొండ మహిళా దీపం రూపారెడ్డి కౌకుంట్ల గ్రామానికి వేళ్లారు. విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, యువనాయకులు కార్తీక్‌రెడ్డితో కలిసి ఇంద్రారెడ్డి సమాది వద్ద పూలమాలేసి ఘనంగా నివాళ్లు ఆర్పించారు. వారి ఆశయాలకనుగుణంగా టీఆర్ఎస్ పార్టీల్లో పని చేస్తామన్నారు. ఇంద్రారెడ్డి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు. కార్యక్రమంలో మహిళలు, టీఆర్ఎస్ నాయకులు కౌకుంట్లకు వేళ్లిన వారిలో ఉన్నారు.