Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని కార్యాలయంలో ధరూర్ మండలం పరిధిలోని పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు సబితా ఆనంద్ పౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా ర్థులను అభినందిస్తూ వారిని సన్మానించారు. విజ్ఞానంతో విశ్వం ముందుకు సాగుతోందని, విద్యనేర్చిన వాడు విశ్వం జయించవచ్చని ఆయన అన్నారు. గ్రామాల్లోని బాల బాలి కలందరూ కచ్చితంగా పాఠశాలలో ఉండేలా ప్రజాప్రతి నిధులు, అధికారులు చూడాలని, సంపూర్ణ అక్షరాస్యత దిశ గా అడుగులు వేయాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతి నిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.