Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని మద్దెలకుంట తండాకు చెందిన నున్సావత్ చాం దీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు మంగళ వారం మృతిచెందింది. విషయం తెలుసుకున్న జిల్లా పరి షత్ గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జెడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ స్థానిక ఎంపీటీసీ సభ్యులు బొప్పిడి గోపాల్‌తో కలిసి చాందీ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తనవంతు సాయంగా వారికి తన కుమారుని జ్ఞాపకార్థం స్థాపించిన జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కస్న నాయక్, మాజీ ఎంపీటీసీ వసంత, నాయకులు రమే ష్ యాదవ్, ధర్మ, వాచ్య, జమ్మల, భాస్కర్, మహేష్, దసురు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.