Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గుల
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధిత కుటుం బానికి ఐక్యత ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సాయం అంద జేశారు. మండలంలోని అవురుపల్లి గ్రామానికి చెందిన కిన్నెర సాలయ్య వారం రోజులగా కడుపు నొప్పి, కాలే యా నికి సంబంధించిన నొప్పితో బాధపడుతు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్పందించి తన సంస్థ ప్రతినిధుల ద్వారా రూ. 5వేల ఆర్థిక సాయాన్ని గ్రామ సర్పంచ్ బాలమోని అలివేలు హరిమో హన్ గౌడ్‌తో కలిసి ఫౌండేషన్ సభ్యులు బాధితుడు సాల య్యకు అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలమోని అలివేలు మోహన్ గౌడ్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు గన్నోజు సత్యం, చంద్రశేఖర్, రమేష్ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.